లవ్ మ్యారేజ్ చేసుకున్న సాహో బ్యూటీ…..!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘సాహో’ సినిమాలో జెన్నిఫర్ పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ. అయితే ఈ భామ ఇప్పడు తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడింది. తన చిరకాల స్వేహితుడు ప్రియుడు డాక్టర్ తుషాన్ భిండితో పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ ఇండో-జర్మన్ నటి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసింది. అయితే వీరి వివాహం ఆత్మీయుల మధ్య ఆస్ట్రేలియాలో జరిగినట్టు సమాచారం అందుతుంది.
అయితే ఎవెలిన్ శర్మ, డాక్టర్ తుషాన్ భిండి 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి ముందు ఒక సంవత్సరం పైగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. తుషాన్ ఆస్ట్రేలియాలో డెంటల్ సర్జన్ గా పని చేస్తున్నారు. నిశ్చితార్థం జరిగినప్పటి నుండి ఎవెలిన్ ఆస్ట్రేలియాలోనే ఉంటోంది. కాగా ఈ బ్యూటీ తన పెళ్లి గురించి మాట్లాడుతూ ‘బెస్ట్ ఫ్రెండ్ను వివాహం చేసుకోవడం కంటే మంచి అనుభూతి లేదు. మా జీవితాన్ని కలిసి గడపడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం’ అంటూ తన పెళ్లిపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే ఈ విషయంపై అభిమాను ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం నెట్టింట్లో ఎవెలిన్ శర్మ-తుషాన్ భిండి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *