రైల్వే స్టేషన్ లో మాస్క్ లేకుంటే… భారీ జరిమానా…

కరోనా సెకండ్ వేవ్ లో మానవాళిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రోజుకి రెండు లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. 80-90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో.. కేంద్రం, అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. తగిన అన్నిరకాల నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
అదేమంటే.. రైల్వే పరిసర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరిగేవారిపై రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించింది. రైల్వే చట్టం ప్రకారం ఈ శిక్ష ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ అయ్యే సమయంలో కానీ, రైలులో ప్రయాణం చేసే సమయంలో కానీ.. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని వెల్లడించింది. లేని యెడల వారి నుంచి రూ.500 చొప్పున జరిమానా వసూలు చేయనున్నట్లు వివరించింది. కాగా కరోనా నివారణ కోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, ఇప్పుడు తాజాగా మాస్క్ ధరించని వారిపై జరిమానా విధించనున్నమని రైల్వేశాఖ వివరించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి రావాలని, సుమారు ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *