రైలు దిగగానే పరుగుపెట్టిన ప్రయాణికులు.. అందుకేనా…

ముంబై నుంచి పెద్ద ఎత్తున వలసలు బీహారుకు తిరుగు ప్రయాణం పడుతున్నారు. వేల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. కరోనా వీరలెవల్లో విజృంభిస్తుండటంతో ఆ రాష్ట్రాలు అప్రమత్తమై రైల్వే స్టేషన్లలోనే కరోనా టెస్ట్ లను చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే.. రైల్వే స్టేషన్ లో రైలు దిగగానే ప్రయాణికులు ఎవరో తరిమి కొట్టినట్టుగా పరుగు లంకించుకొని ఉరుకులు, పరుగులు తీశారు. బయటకు వెళ్లే వరకు ఎక్కడా వెనుతిరిగి కూడా చూడకుండా గుక్కపెట్టి మరీ పరుగులు తీశారు.
అయితే అందుకు కారణం ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులు భారీ స్థాయిలో నమోదవుతూ ఉండటంతో ఎక్కడ లాక్ డౌన్ విధిస్తారేమో అనే భయంతో వలస కూలీలు సొంత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ముంబై నుంచి బీహార్ కు వలస కూలీలు తరలి వెళ్తున్నారు. దీంతో బీహార్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రైల్వే స్టేషన్లు వలస కార్మికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని బీహార్ ముఖ్యమంత్రి ఆదేశించడంతో రైల్వే స్టేషన్లలో కరోనా టెస్టులు నిర్వహించేందుకు బీహార్ వైద్య సిబ్బంది రెడీ అయింది. కాగా ప్రయాణికులు ఎక్కడ కరోనా టెస్టులు చేస్తారోనని.. అలా చేసి పాజిటివ్ వస్తే ఎక్కడ క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందో అనే భయంతో ప్రయాణికులు ఆగకుండా పరుగులు పెట్టారు. ఆ పిక్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇంట్రస్టింగ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *