రేర్ పిక్.. రెస్టారెంట్ లో విజయ్, రష్మిక
టాలీవుడ్ లో ‘గీతగోవిందం’ సినిమాతో ఓ వెలుగు వెలుగుతున్న జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న. వీరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంది. అయితే ఈ జంట ‘డియర్ కామ్రెడ్’ సినిమాతో మరోసారి రొమాన్స్ తో ఆకర్షించారు.
అయితే ఆన్ స్క్రీన్ మీదే కాకుండా, ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్ షిప్ మంచిగా పండుతుందని పుకార్లు.. షికార్లు చేస్తున్నాయి. అలాగే… ప్రస్తుతం ఈ జంట ఎవరి ప్రాజెక్ట్స్తో వారు చాలా బిజీ అయిపోయారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ సినిమా చేస్తుండగా.. రష్మిక సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది.
అంతేకాకుండా బాలీవుడ్ సినిమాలో కూడా రష్మిక చాలా బిజీగా గడుపుతుంది. తాజాగా విజయ్- రష్మిక ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ వద్ద కెమెరాకు చిక్కారు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో డిన్నర్కు వెళ్లిన ఈ జంట.. డ్రెస్సింగ్ తో పాటు, రష్మిక చేతిలో ఫ్లవర్ బొకే కనిపించడంతో ఆ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా ప్రస్తుతం వీరిద్దరి సినిమాలు ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటుండటం విశేషం.