రేపే వకీల్ సాబ్ థర్డ్ సింగిల్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్ లో మరింత వేగాన్ని పెంచింది చిత్రబృందం. చిత్ర నిర్మాతలైన దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమా ప్రమోషన్స్ పై భారీగా దృష్టి సారించారు.
అయితే హిందీ సినిమా ‘పింక్’కు రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’ సినిమా కోసం తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుండీ ఇప్పటికే రెండు రిలికల్ వీడియోలు రిలీజై.. సోషల్ మీడియాలో సునామీ సృష్టించాయి. తాజాగా థర్డ్ సింగిల్ ‘కంటిపాప…’ లిరికల్ వీడియోను మార్చి 17వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు విడుదల చేయనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘వకీల్ సాబ్’లో ముచ్చటగా మూడోసారి శ్రుతీహాసన్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఇక నివేదాథామస్, అంజలి, అనన్య నాగళ్ళ ఇతర కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. మరి ఈసారి వకీల్ సాబ్ ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.