రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్….
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢీల్లీ పర్యటన ఖరారు అయింది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబందించిన నిధులు, పెండింగ్లో ఉన్న అంశాలపైన, విభజన చట్టంలో అమలు చేయాల్సిన హామీల పైన సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రి షాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అయితే అమిత్ షాతో భేటీ తర్వాత ఢిల్లీలో అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులతో కూడా సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అలాగే కరోనా కారణంగా పోలవరం నిర్మాణం పనులు అనేకం పెండింగ్లో ఉన్నాయని, అందుకు సంబంధించిన బిల్లులు కూడా కేంద్రం నుంచి రావాల్సి ఉందని తెలుస్తోంది. కాగా ఈ ఎడాదిలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే.