రేపటి నుంచి చంద్రబాబు మున్సిపల్ ప్రచారం

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటి ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. మున్సిపాలిటీ, కార్పోరేష్ లో గెలుపు కోసం అన్ని పార్టీలు మూకుమ్మడిగా పోరాడుతున్నాయి. మార్చి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
అసలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో విజయాలను అందుకోవాలని చూస్తుంది. అయితే వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం బాధ్యతలను భుజానికి ఎత్తుకోవడం కేడర్ కు ఉత్సాహాన్ని ఇచ్చేందుకే అని చెప్పవచ్చు. రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ప్రచారం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. అందుకోసం గురువారం నుంచి ప్రచారం నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే చంద్రబాబు ప్రచారంలో భాగంగా నిమిత్తం కర్నూలు, చిత్తూరు, తిరుపతి, విశాఖ, విజయవాడ, గుంటూరులలో జరిగే రోడ్డు షోలలో పాల్గొనబోతున్నారు. ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాల్లో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ ఉవ్విళ్లూరుతుంది. బాబు రంగంలోకి దిగడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. దూకుడుగా ప్రచారం నిర్వహిస్తేనే విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అలాగే అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని, రాష్టంలో అరాచక పాలన జరుగుతుందని, బెదిరించి అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకొనే విధంగా చేస్తున్నారని వైసీపీ శ్రేణుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నాయకత్వం వెల్లడిస్తుంది. కష్టపడి పోరాటం చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. కాగా గురువారం నుంచి ప్రచారం చేసేందుకు బాబు సిద్ధం కావడంతో తెలుగుదేశం పార్టీ అందుకోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *