రెహమాన్ ముందుకు సుశీలమ్మ రిక్వెస్ట్…

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ‘99 సాంగ్స్’ సినిమాతో స్క్రీన్ రైటర్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయనే ఈ సినిమాని నిర్మించడం మరో విశేషమనే చెప్పాలి. అలాగే ‘99 సాంగ్స్’లో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమాని హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్, జియో సినిమాల్లో ప్రసారం అవుతున్నాయి. ఈ మధ్య సినిమాను చూసిన లెజెండరీ సింగర్ పి. సుశీల ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అదేమంటే… తన బయోపిక్ చేయాలని ఆమె రెహమాన్ను రిక్వెస్ట్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ ‘రీసెంట్ గా నేను సుశీలమ్మతో మాట్లాడాను. ఆమెను ‘99 సాంగ్స్’ మూవీ చూసారా? అని అడిగాను. ఒకవేళ ఇంకా సినిమాను చూడకపోతే నెట్ఫ్లిక్స్లో చూడమని చెప్పాను.
అంతేకాకుండా ఆ సమయంలో పక్కనే ఉన్న ఆమె సోదరుడికి ఈ సినిమా తెలుగు వెర్షన్ను నెట్ఫ్లిక్స్లో సుశీలమ్మకు చూపించమని రిక్వెస్ట్ చేశాను. సినిమా చూసిన తర్వాత సుశీలమ్మ నన్ను పిలిచి మా బృందాన్ని మెచ్చుకున్నారు. తన బయోపిక్ను ‘99 సాంగ్స్’ సినిమాలా చేయమని ఆమె నన్ను కోరింది’అని తెలిపారు. కాగా సుశీలమ్మ ప్రశంసలు కురిపించడంతో రెహమాన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి ఆయన సుశీలమ్మ బయోపిక్ ను కూడ ఎప్పుడు తెరకెక్కిస్తారో చూడాలి. మొత్తానికి సుశీలమ్మ కోరికను రెహమాన్ ముందు అలా పెట్టారన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *