రెండో పెళ్లి రూమర్స్ పై హీరో సుమంత్ క్లారిటీ…!

టాలీవుడ్ అక్కినేని వారి హీరో సుమంత్, మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు! అనే వార్త ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. మీడియాలో, సొషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా ఇది మారింది. చివరకు ప్రముఖ డైరెక్టర్ వర్మగారు కూడా దీనిపై స్పందించారు. పెళ్లంటే పడని ఆర్జీవీ సారు ఊరుకోరు కదా? సుమంత్ ని ట్యాగ్ చేసి మరీ ‘పెళ్లంటే పెద్ద పెంట’ అంటూ పోస్టింగ్ పెట్టాడు. సుమంత్ కూడా ఇక తప్పదని, ఇప్పుడు కూడా రెస్పాండ్ కాకపోతే బాగోదని క్లారిటీ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే… పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ పెళ్లి అంటూ మీడియాలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రామ్ గోపాల్ వర్మతో పాటు చాలా మంది స్పందించారు. రాము వద్దని సూచిస్తే.. ఇతరులు మాత్రం సుమంత్ కి ‘కంగ్రాచ్యులేషన్స్’ చెప్పేశారు. కానీ.. తాజాగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం ‘పెళ్లి వార్తలన్నీ ఉట్టివే’ అని స్పష్టమైంది. ఇంతకీ సుమంత్ ఏమన్నారు అంటే.. తనకు రెండో పెళ్లి ఉద్దేశం లేనేలేదని తేల్చేశాడు. అయితే, ఆన్ లైన్ లో వైరల్ అయిన ‘సుమంత్ వెడ్స్ పవిత్ర’ వెడ్డింగ్ కార్డ్ సంగతేంటి? అంటే… అది ఓ సినిమా కోసం డిజైన్ చేసిన పెళ్లి పత్రికనట! ‘ఎలాగో కానీ…’ అది సెట్స్ పై నుంచీ బయటకు లీకైందని చెప్పాడు సుమంత్.
మొత్తానికి పెళ్లి, విడాకులు వంటి అంశాలతో ప్రస్తుతం సుమంత్ ఓ సినిమా చేస్తున్నాడు. అందుకు సంబంధించిన అప్ డేట్ కూడా త్వరలో ఉంటుందని ఆయన తన వీడియో ద్వారా వివరించారు. అదే సినిమాకి సంబంధించిన పెళ్లి పత్రిక రకరకాల పుకార్లు, ప్రకంపనలకు దారి తీసింది. కాగా చాలా మంది నెటిజన్స్ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోవటం లేదని అర్థమై డిజపాయింట్ అవుతున్నారు. అంతేకాకుండా మనువాడితే తప్పులేదని చెప్తున్నారు. కానీ.. కొందరు మాత్రం ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కూడా అయ్యి ఉండొచ్చ’ని కామెంట్ చేస్తున్నారు. చూడాలి, సుమంత్ నెక్ట్స్ మూవీ అప్ డేట్ ఎప్పుడొస్తుందో మరి. చూద్దాం అసలు ఈ గోల ఏమిటో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *