రూ. 70 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ రంగానికి తెలంగాణ పెద్దపీట

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చాలా వాడివేడిగా సాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఈరోజు సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేటీఆర్ తెలిపారు.
అయితే ఆయన ఏమన్నారంటే ఎలక్ట్రినిక్ తయారీలో తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. 912 ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్ తయారీ క్లష్టర్స్ ఉన్నాయని వివరించారు. పర్యావరణ వ్యవస్థను పరిరక్షించేందుకు ఎలక్ట్రానిక్స్ కు ప్రభుత్వం మంచి ప్రోత్సాహకాలు ఇస్తుందని అన్నారు. ఎలక్ట్రానిక్ ప్రోత్సాహకాల కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు అయన వివరించారు. రూ.70వేల కోట్ల పెట్టుబడులతో 4 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి కేటీఆర్ సభలో వివరించారు.