రుద్రలో అజయ్ సరసన రాశీఖన్నా

కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటంతో మన స్టార్స్ అంతా ఓటీటీలపై పట్టు సాధిస్తున్నారు. ముఖ్యంగా ఇది సౌత్ స్టార్ కంటే నార్త్.. బాలీవుడ్ స్టార్స్ లాక్ డౌన్ లు, థియేటర్ల మూసివేతతో డిజిటల్ స్ట్రీమింగ్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతుండటం చూస్తూనే ఉన్నాం. మరి తాజాగా అజయ్ దేవగణ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యారు.
అందులో భాగంగా ‘రుద్ర – ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ పేరుతో డిస్నీ హాట్ స్టార్ వీఐపీ ప్లాట్ ఫామ్ పై అజయ్ దేవగణ్ తొలి వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. అయితే జూలై 21న బీబీసీ స్టూడియోస్ వారి ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రెండు నెలల పాటూ ముంబైలోని చాలా ఐకానిక్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోనున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే… ‘రుద్ర’ వెబ్ సిరీస్ లో మన టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా ఫీమేల్ లీడ్ లో నటించనుంది. కాగా రాశీఖన్నా ఇప్పటికే ‘ద ఫ్యామిలీ మ్యాన్’ దర్శకులు రాజ్ అండ్ డీకే నెక్ట్స్ రూపొందించబోతోన్న సిరీస్ లో నటిస్తోంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. దీంతో రాశీ ఖన్నా సెకండ్ ఓటీటీ ప్రాజెక్ట్ గా ‘రుద్ర’ వెలువడటం విశేషం.
అయితే ‘రుద్ర’ వెబ్ సిరీస్ బీబీసి వారి సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ ‘లూథర్’కి అఫీషియల్ రీమేక్. ఇండియాలో బీబీసీ స్టూడియోస్ తో కలసి అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దీన్ని నిర్మిస్తుండటం విశేషం. రాజేశ్ మపుస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ‘రుద్ర’… ఓ పోలీస్ డిటెక్టివ్ కి సంబంధించిన స్టోరీ. అతను ఒక సైకోపాత్ అండ్ మర్డర్ తో అనుకోని పరిస్థితుల్లో స్నేహం చేస్తాడు. వారిద్దరూ పలు కేసుల్ని ఆసక్తిర పరిణామాల మధ్య పరిష్కరించడం వంటి ఘటనలతో నడుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *