రివర్స్ గేమ్… బీజేపీలోకి ఈటల… మరి టీఆర్ఎస్ పెద్దిరెడ్డి..
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఈటల నెక్స్ట్ అడుగు ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ తాజాగా బీజేపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకుగాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది.
అయితే జూన్ 2వ తేదీన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈటల సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఇలాంటి సమయంలో ఈ ఉపఎన్నికల బరిలో ఎవరిని నిలపాలనే విషయంలో టీఆర్ఎస్ తర్జనభర్జన పడుతుంది. హుజూరాబాద్ లో ఈటల స్థాయి నాయకులు ఎవరు లేరు. పక్క నియోజకవర్గంలో నుంచి ఓ నాయకున్ని తెచ్చుకోవాలి… లేదా ఇతర పార్టీల లీడర్ కు గాలం వేయాల్సిందే. కాగా గులాబీ బాస్.. కేసీఆర్ మాత్రం ఇతర పార్టీ లీడర్ కే మొగ్గు చూపినట్లు సమచారం అందుతుంది. ఈటల బిజేపిలోకి చేరగానే.. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యూహంపై ఇప్పటికే ట్రబుల్ షూటర్ కు ఆదేశాలు వెళ్లాయని టాక్ నడుస్తోంది. మొత్తానికి చూసుకుంటే పెద్దిరెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడం షురూ అయినట్లే తెలుస్తోంది. మరి చూద్దాం.