రిలీజ్ కు సిద్ధమైన ఉదయకిరణ్ చిత్రమ్ చెప్పిన కథ…
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ అకాల మృత్యువాత పడి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది. అయితే ఆయన నటించిన చివరి సినిమా మాత్రం ఇంకా విడుదలకు నోచుకోక పోవడం బాధాకరం. అయితే చివరగా తాను నటించిన సినిమా ‘చిత్రమ్ చెప్పిన కథ’. ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది.
అయితే 2015లోనే థియేటర్లలోకి రావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. మరి ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ‘చిత్రమ్ చెప్పిన కథ’ మేకర్స్ సినిమా విడుదల విషయంపై ఈ మధ్య రెండు ఒటిటి ప్లాట్ఫామ్లతో చర్చలు జరిపినట్లు సమాచారం అందుతుంది. వారు ఈ ప్లాట్ఫారమ్ల నుండి ఆసక్తికరమైన ఆఫర్లను అందుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కాగా ఈ వార్తలు నిజమైతే త్వరలోనే ఈ సినిమా ఓటిటి ద్వారా ప్రేక్షకులను అలరించనుంది అన్నమాట. అలాగే ఈ సినిమా విడుదలపై ఉదయ్ కిరణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.