రాసలీలల సీడీ చూపించి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు

కర్నాటకలోని మంత్రి రాసలీలల వీడియో వ్యవహారం, ఆ తర్వాత ఆ మంత్రిగారి రాజీనామా విషయం జరిగిన తంతు అంతా తెలిసిందే. కన్నడనాట రాసలీలల సీడీ కేసు దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీడియోలో కనిపించి పదవిని కోల్పోయిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిని తాజాగా సిట్ అధికారులు విచారించారు. బెంగళూరులోని ఆయన నివాసంలో సుమారు రెండు గంటల పాటు విచారణ జరపగా అందులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నాలుగు పేజీల వాంగ్మూలాన్ని నమోదు చేశారు విచారణ అధికారులు. ఆ వీడియో సీడీ సంగతి తనకు నాలుగు నెలల క్రితమే తెలుసని రమేశ్ చెప్పినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఆ రాసలీలల వీడియోను చూపి రూ. ఐదు కోట్లను ఇవ్వాలని తనను డిమాండ్ చేశారని మంత్రి విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకొనేందుకు ఇలా నకిలీ సీడీతో కుట్ర చేశారని వివరించారు. కాగా వీడియోలో ఉన్నది తాను కాదని, ఆ సీడీకి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *