రామ్ సరసన ప్రియాప్రకాశ్ కి ఛాన్స్

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్. ‘ఇస్మార్ట్ శంకర్’తో ఫామ్ లోకి వచ్చిన రామ్ ‘రెడ్’ తో మళ్లీ అలా పడిపోయాడు. దీంతో ఇప్పుడు ఎలాగైనా సరే మంచి హిట్టు కొట్టాలన్న కసి మీదున్న రామ్ కాస్త కూడా గ్యాప్ ఇవ్వకుండా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్.
అయితే ఈ సినిమా తర్వాత రామ్ చేయబోయే సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియాకు ఎందుకు తెలుగులో అంతగా కలసి రావటం లేదు. నితిన్ ‘చెక్’లో నటిస్తే… ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ప్రస్తుతం తేజ సజ్జ సరసన ‘ఇష్క్’ సినిమా చేసింది. కరోనా సెకండ్ వేవ్ తో ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఒక్కసారి కన్ను కొట్టి దేశమంతా తనవైపు తిప్పుకున్న ఈ అమ్మడు నటించిన సినిమాలేవీ హిట్ కాకపోవడంతో అనుకున్న స్థాయిలో అంతగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు రామ్ నెక్స్ట్ మూవీలో ఎంపిక కావడం విశేషమనే చెప్పాలి. కాగా ఈ సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్న మారుతి ఆ తర్వాత రామ్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రియా ప్రకాశ్ కి రామ్ సరసన ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.