రామ్ చరణ్- శంకర్ సినిమాలో పవర్ స్టార్…
దర్శక సంచలనం శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
అయితే వీరి కాంబినేషన్ లో రానున్న సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే టాక్ నడుస్తుంది. అంతేకాకుండా రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్ హీరోలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలుగు వెర్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కన్నడంలో ఉపేంద్ర, తమిళంలో విజయ్ సేతుపతి, హిందీ వెర్షన్ లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్ట్ పై ఆయా భాషలలో హీరోలు అంగీకరిస్తే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం విశేషం.