రాబోవు కాలంలో మరిన్ని రాజకీయ సమీకరణాలు చూస్తారు: కవిత

తెలంగాణలో ఈమధ్య కొన్ని రాజకీయ పరిణామలు చోటు చేసుకున్నాయి. దీంతో టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ముందు ముదు మరిన్ని చేరికలు ఉండవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తాజాగా టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ.. టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం కూడా జోరందుకుంది. కానీ ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పర్యటనలో ఆమె మాట్లాడారు. ఆమె ఏమన్నారు అంటే… రానున్న రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని హాట్ కామెంట్స్ గుప్పించారు. రాజకీయం ఇక నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, ఏది జరిగినా అది టీఆర్ఎస్ పార్టీ మంచికే జరుగుతుందని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా రాష్ట్రంలో అనేక అంశాలు చర్చకు వస్తాయని తెలిపిన ఆమె ఇంతకు మించి ఇప్పుడు ఏమీ మాట్లాడను అంటూ ముగించారు. మొత్తానికి కవిత మాటలతో తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ సమీరణలు మారుతాయనే చర్చ మళ్లీ మొదలైంది. అంటే మరికొందరు నేతలు… కారెక్కుతారా..? అనే గుసగుసలు వినిపిస్తున్నయి. మరికొంతమంది నేతలను ఉద్వాసన తప్పదా? అనే చర్చ కూడా మొదలైంది. కాగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. ఎమ్మెల్సీ కవిత చెప్తున్న ఆ సమీకరణాలు ఏంటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే మరి. చూద్దాం ఏం జరుగుతుందో.