రాపో19 కోసం రాక్ స్టార్ రంగంలోకి….

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా తమిళ దర్శకుడు లింగుసామితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు చిత్రయూనిట్. అంతవరకు ఈ సినిమా ‘రాపో19’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటుంది. ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. లింగుస్వామికి తెలుగులో ఇదే డైరెక్ట్ గా ఫస్ట్ సినిమా. గతంలో ఆయన విశాల్ ‘పందెంకోడి’ చిత్రానికి దర్శకత్వం వహించగా… ఆ సినిమా తెలుగులో కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
కాగా తాజాగా ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గతంలో రామ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైలజ’ సినిమాలోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సారి కూడా వీరి కాంబోలో మంచి మ్యూజిక్ రానున్నట్లు ఫ్యాన్స్ లో అంచనాలు మొదలయ్యాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *