రాధేశ్యామ్ ధియేటర్స్ లోనే విడుదల…
టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. అయితే ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా జూలై 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రకటించిన తేదీకే రాధేశ్యామ్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న దర్శక, నిర్మాతలు ఈ మధ్య బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమాని ఫాలో అవుతున్నట్లు పెద్దఎత్తున టాక్ నడుస్తోంది.
అదేవిధంగా రాధే సినిమా వలెనే ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై సినిమా యూనిట్ స్పందించింది. వారు ఏమన్నారంటే ఈ సినిమా షూటింగ్ మరో పది రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలిపింది. అంతేకాకుండా రాథేశ్యామ్ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని కూడా స్పష్టం చేసింది. కాగా ఈ విషయంలో తమకు ఎలాంటి తొందరపాటు లేదని కూడా వెల్లడించింది ‘రాధేశ్యామ్’ యూనిట్. దీంతో గాసిబ్స్ అనుమానాలకు చెక్ పెట్టినట్లైంది.