రాజధాని తరలింపు తథ్యం… : శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి టీడీపీలై మండిపడ్డారు. రాజధాని తరలింపు ఖాయమని… తమది ఎలాంటి స్వార్థంతో కూడుకున్న ప్రభుత్వం కాదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పోలవరం పూర్తి చేస్తామన్నారు కానీ…. ఏమీ చేయలేదని, పోలవరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి 24 క్లియరెన్స్ గాను 23 క్లియరెన్స్ పూర్తి చేసి అందుకు తగిన రూపు రేఖలు తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. అలాగే రఘురామకృష్ణరాజు రాజకీయం కోసం అనేక లేఖలు రాసుకుంటే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని.. భూకబ్జా చేసి రౌడీయిజాలు, హత్యలు చేసిన వారిపై కేసుపెట్టొద్దు అంటే ఇది ఎక్కడి న్యాయమని ఆయన విరుచుకు పడ్డారు. తాము టీడీపీ వాళ్లమని, ఏం చేసినా చూసీ చూడనట్లు వదిలేయాలి అంటే కుదరదని తెలిపారు.
అంతేకాకుండా గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు ముద్రగడ పద్మనాభాన్ని ఏమి చేశారో… విమానాశ్రయం దగ్గర ఏ తప్పులు చేయకపోయినా ఎన్ని అక్రమ కేసులు మాలాంటి వారిపై పెట్టారో అందరికీ తెలుసని అన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చూస్తున్నామని.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని చూస్తుంటే ప్రతిపక్షం అడ్డుపడుతుందని విరుచుకు పడ్డారు. అలాగే ఎన్నికలు ముగిసిన మరుసటిరోజే.. బీజేపీకి అధిక మెజారిటీ రావడం మా దురదృష్టమని ఢిల్లీలో సీఎం జగన్ అన్నారని…ప్రతిపక్షంలో ఎవరైనా అన్నారా? అని శ్రీకాంత్ రెడ్డి టీడీపీకి చురకలు అంటించారు. కాగా ప్రతిపక్షలో ఉన్న చంద్రబాబు మోడీని ఒక్కమాట అనడానికి కూడా భయపడి వణుకిపోతున్నారని శ్రీకాంత్ రెడ్డి బాబుపై దుమ్మెత్తిపోశారు.