‘రాకెట్ బోయ్స్’ వెబ్ సీరీస్ లో రెజీనా కాసాండ్రా

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో ఓ పాటల కనిపించనున్నా రెజీనా కాసాండ్రా ఈ మధ్య మరింత దూకుడు పెంచింది. ఎవరు సినిమా హిట్ తర్వాత తెలుగు సినిమాలో కనిపించడం మానేసింది ఈ చెన్నై సుందరి. అయితే ప్రస్తుతం వరుసగా రెజీనా తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి విడుదలకు సిద్ధం కూడా అయింది. ‘పార్టీ, కల్లాపార్ట్, కసాదా తప్పర, శూర్పణగై’ పేర్లలో ఆ సినిమాలు తెరకెక్కబోతున్నాయి.
అయితే తాజాగా తెలుగులోనూ ‘నేనా నా’, ‘మిడ్ నైట్ మర్డర్స్’ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా… ఓ క్రేజీ ఆఫర్ కు రెజీనా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాయ్ కపూర్ ఫిల్మ్ అండ్ ఎమ్మీ ఎంటర్ టైన్ మెంట్స్ రూపొందించే వెబ్ సీరీస్ ‘రాకెట్ బోయ్స్’లో కీలక పాత్ర కోసం రెజీనాను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇదో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్. అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన ఏపీజే అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, హోమీ బాబా వంటి మేథావుల నిజజీవిత కథలతో ‘రాకెట్ బోయ్స్’ని తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో రెజీనా ఛాన్స్ దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. కాగా ‘ఏక్ లడకీ కో తో అసీ లగా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా రెజీనా ఆ సినిమా అంతగా కలిసి రాలేదు. ఇప్పుడు ఈ హిందీ వెబ్ సిరిస్ తోనైనా ఈ చెన్నైభామ బాలీవుడ్ లో నిలదొక్కుకుంటుందేమో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *