రష్మికకు ఇలాంటి వరుడే కావాలంట…..!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ బ్యూటీ టాలీవుడ్ లో ‘పుష్ప’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. అటు బాలీవుడ్ సినిమాలతోను ఇటు సౌత్ సినిమాలతోనూ ఎంతో బిజీగా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు రష్మిక మందన. ఈ మధ్యనే రష్మిక బీటౌన్ ఆఫర్లు రావడంతో ముంబైకి మకాం మార్చేసింది.
అదేవిధంగా ప్రస్తుతం ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బాయ్’ సినిమాల్లో నటిస్తోన్న రష్మిక… సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈ భామ… అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. అవేమంటే… మీకు ఎలాంటి లక్షణాలు వున్న హస్బెండ్ రావాలని కోరుకుంటున్నారు? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. అందుకు… రష్మిక సమాధానం ఏమిచ్చిందో తెలుసా..? ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సాధారణ వ్యక్తి అయి ఉండాలని ఇలాంటి వ్యక్తులంటేనే తనకు ఇష్టమని తెలిపింది. అంతేకాకుండా మంచి వ్యక్తిత్వం ఉండాలని.. స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నవారు అస్సలు నచ్చారని కూడా వెల్లడించింది. కాగా తనకు విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని.. దయచేసి వేరేగా రిలేషన్షిప్ వంటి వాటిల్లోకి లాగవద్దంటూ భామ స్పష్టం చేసింది.