రంగ్ దే కోసం మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్
‘భీష్మ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్ చెక్ సినిమా కాస్త్ నిరాశను మగిల్చింది. అయితే నితిన్ ప్రస్తుతం తన ఆశలన్నీ ‘రంగ్ దే’ మీదే పెట్టుకున్నాడు. ముఖ్యంగా ‘భీష్మ’ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థే దీనిని కూడా నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రారంభం నుండి దర్శకుడు వెంకీ అట్లూరితో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా మంచి ఖుషీగా ఉన్నారు. అలాగే.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ సినిమా మీద బజ్ ను క్రియేట్ చేశాయి.
అయితే ‘ఉప్పెన’ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సూపర్ ట్యూన్స్ అందించాడు. దాంతో ఈసారి కాస్తంత గట్టిగానే ‘రంగ్ దే’ను ప్రమోట్ చేయాలని నిర్మాత నాగవంశీ ఫ్లాననన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రీజన్స్ లో ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ లోనూ, ఆంధ్రకు సంబంధించిన వేడుకను రాజమండ్రిలో, రాయలసీమలోని కర్నూల్ లోనూ జరుపనున్నారు. కాగా వాటిలో మొదటి ఈవెంట్ గా ట్రైలర్ రిలీజ్ ను ఈ నెల 19న కర్నూల్ ఎస్.టి.బి.సి. కాలేజ్ లో జరుపబోతున్నారు. మరి మిగిలిన రెండు చోట్ల ఎప్పుడు నిర్వహించనున్నారు అనేది తెలియడం లేదు. మొత్తానికి నితిన్, కీర్తి సురేశ్ ఫస్ట్ కాంబినేషన్ మూవీ ‘రంగ్ దే’ పై ఫ్యాన్స్ లో భారీ క్రేజ్ నెలకొంది.