యూపీ పై ఆర్ఎస్ఎస్ ఫోకస్…. అందుకేనా…!

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల కోసం అన్నిపార్టీలు ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు చాలా తీవ్రంగా పావులు కదుపుతుంది. అదే సమయంలో అధికారపార్టీ తప్పులను ఎత్తి చూపుతూ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నాయి ప్రతిపక్షపార్టీలు.
అయితే ఎన్నికలు ఏడాది కాలం ముందు నుంచే బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు యూపీపై పూర్తిగా దృష్టి సారించింది. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన భగత్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లికీ మరికొంత మంది ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు కూడా రానున్నారు. వీరంతా వచ్చే ఎడాది యూపీలో జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై చర్చించనున్నారు. అలాగే కరోనా కట్టడికి తీసుకుంటున్న.. తీసుకోవాల్సిన పలు చర్యలపై కూడా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కాగా వచ్చే ఎడాది మొదట్లోనే యూపీకి ఎన్నికలు జరగనున్నాయి. అటు బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా యూపీ బీజేపీలో లుకలుకలు ఉన్నప్పటీకీ వచ్చే ఎన్నికల్లో యోగి సర్కార్ సాధించిన విషయాలపై దృష్టి సారించాలని బీజేపీ నేతలకు అధిష్టానం సూచిస్తున్నట్లు సమచారం అందుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *