యూట్యూబ్ లో దంచికొడుతున్న సారంగదరియా
అనతి కాలంలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొంది స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రౌడీ బేబీ సాయిపల్లవి. అయితే ఈ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే…. అయినప్పటికీ ఆమె అభినయానికి, డ్యాన్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఏర్పరచుకుంది. అసలు టాలీవుడ్ లో ఆమె నటించిన సాంగ్స్ కు వచ్చినంత ఆదరణ మరే హీరోహీరోయిన్ లకు రాదు.
తాజాగా సాయి పల్లవి మరో సాంగ్ రికార్డు క్రియేట్ చేస్తూ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరి’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కు యూట్యూబ్ అనూహ్యమైన ఆదరణ వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ జానపదం పాట ‘సారంగ దరియా’. ఈ పాట ఇప్పుడు 250 మిలియన్ వ్యూస్ ను దాటేసి మరోసారి సంచలనం సృష్టించింది. కాగా ఈ లిరికల్ వీడియో సాంగ్ లిరిక్స్, మ్యూజిక్, మంగ్లీ పాడిన తీరు, సాయి పల్లవి వేసిన స్టెప్పులు… అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘సారంగ దరియా’ సాంగ్ రిలీజై చాలా రోజులే అయినప్పటికీ ఆ పాట జోరు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఈ పాట మరి ముందు ముందు ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుంది చూడాలి.