యాత్ర దర్శకుడితో జెర్సీ బ్యూటీ…
టాలీవుడ్ లో యాత్ర సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మహి వీ. రాఘవ్. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాతో దర్శకుడు మహి వీ రాఘవ్ అభిమానులకు మరింత దగ్గర అయ్యాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మమ్ముటీ నటించగా.. ఆశ్రిత వేముగంటి, సుధీర్ బాబు, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
అదేవిధంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం దర్శకుడు మహి వీ రాఘవ్ ఓ సెటైరికల్ కామెడీ సినిమాను తీయబోతున్నాడు. ఇందులో ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాని కూడా దర్శకుడు పొలిటికల్ నేపథ్యంలోనే సెటైరికల్ గా చేయనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలువురు కమెడియన్లను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.