మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా శృతి హాసన్….
విశ్వనటుడు కమలహాసన్ గారాలపట్టి శృతిహాసన్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా ఎన్నికైంది. టైమ్స్ సంస్థ ప్రతీ సంవత్సరం ప్రకటించే ‘మోస్ట్ డిజైరబుల్-2020’ అనే ప్రెస్టేజియస్ లిస్ట్ ను విడుదల చేసింది. అయితే తాజాగా శృతి హాసన్ 2020లో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా ఎంపికైంది.
అదేవిధంగా ఈ జాబితాలో సమంతా 2వ స్థానంలో, పూజా హెగ్డే 3వ స్థానంలో, రకుల్ ప్రీత్ 4వ స్థానంలో, రష్మిక మండన్న 5వ స్థానంలో నిలిచారు. అలాగే శృతి హాసన్ దాదాపు రెండు సంవత్సరాలు అసలు టాలీవుడ్ లోని ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. అలాంటిది ఈ బ్యూటీ ‘మోస్ట్ డిజైరబుల్-2020’కి గా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. కాగా 2021లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది శృతి హాసన్. ఈ సంవత్సరం మొదట్లో ‘క్రాక్’తో హిట్ కొట్టిన శృతి హాసన్… తాజాగా విడుదలైన ‘వకీల్ సాబ్’తో మరో హిట్ ను అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో శృతి హాసన్ నటిస్తుంది. ఇది ఎలాంటి రికార్డ్ లను సృష్టిస్తుందో చూడాలి.