మావోయిస్ట్ కీలక నేత హరిభూషణ్ కరోనాతో మృతి….
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత.. ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన కన్నుమూశారని సమాచారం. కరోనా మహమ్మారి సోకడంతో పాటు… గడువు ముగిసిన ఆహారాన్ని తీసుకోవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారి మరణించారని తెలుస్తోంది. అలాగే దాదాపు డజనుకు పైగా మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతుంది.
అదేవిధంగా అనారోగ్యం బారినపడి మావోయిస్టులతో పాటు ఇతరులు కూడా లొంగిపోవాలని.. పునరావాస ప్రయోజనాలు పొందాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా హరిభూషణ్ మరణవార్తపై స్పందించిన దంతేవాడ ఎస్పీ డాక్టర్ పల్లవ్… ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని మినగట్ట గ్రామంలో జూన్ 21న ఆహారం వికటించి.. కరోనా కారణంగా హరిభూషణ్ మరణించారిన స్పష్టం చేశారు. అయితే హరిభూషణ్ పై రూ.40 లక్షల రివార్డు ఉందని.. ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్, తెలంగాణ సరిహద్దులో ఆయన చాలా చురుకుగా పనిచేశారు. తెలంగాణలోని మహాబుబాబాద్ జిల్లాలోని కొట్టగూడ ప్రాంతం మారిగుడ గ్రామానికి చెందిన హరిభూషణ్ అలియా యాపా నారాయణ్… 1995లో పీపుల్స్ వార్ గెరిల్లాలో చేరారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.