మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో కాజల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలతో జోరు మీద ఉంది. తాజాగా విడుదలైన ‘మోసగాళ్ళు’లో విష్ణుకు అక్కగా నటించిన కాజల్ త్వరలో గూఢచారిగా మెరవనుంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కాజల్ రా ఏజెంట్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా నాగ్-కాజల్ కలయికలో రాబోతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. నాగ్ కు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ కనిపించనుంది. నిజానికి ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఇందులో రా-ఏజెంట్ గా కనిపించటానికి కాజల్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకోసం మార్షల్ ఆర్ట్స్ లో, ఆయుధాలు ఎలా పట్టుకోవాలనే విషయాల్లో ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఆ ట్రైనింగ్ పూర్తి కాగానే నాగ్-ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్ లో కాజల్ జాయిన్ కానుంది.