మార్చి1 నుంచి అమలయ్యే కొత్త వడ్డింపులు ఇవే..

రేపటి నుంచి దేశంలో కొత్త రూల్స్ అమలు కానున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి కేంద్రం కొత్తగా భారీగా వడ్డించిన గ్యాస్ ధరలు, బ్యాంకింగ్ సర్వీసులు, వాహనాలు వంటి పలు రంగాల్లో కొత్తగా నిబంధలను అమలు కానున్నాయి. మొత్తానికి చూసుకొంటే ఏ యే వాటిల్లో వినియోగ దారునికి ఎలాంటి, ఎంత భారం పడనుంది వంటి అంశాలు వరుసగా ఇప్పుడు చూద్దాం.

గ్యాస్ భారం..

దేశంలో ప్రస్తుతం ఎల్‌పిజి కనెక్షన్ లేని కుటుంబం అంటూ ఉండకపోవచ్చు. ప్రతి కుటుంబానికి గ్యాస్ నిత్యావసరం. ప్రస్తుతం పెంచిన ఎల్‌పిజి ధర సామాన్యులకు మరింత ప్రభావం చూపనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గతంలో ప్రతి నెల మొదటి వారంలో గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న ఘటనలు మనం చూశాం. కానీ.. కొంతకాలంగా అంతర్జాతీయ చమురు ధరల పెరుగుతుండటంతో ధరల పెంపులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఒక్క ఫిబ్రవరి నెలలోనే మూడు సార్లు గ్యాస్ ధరలను సవరించాల్సి వచ్చింది. చమురు ధరలు భారీగా పెరగడంతో గ్యాస్ ధరలను కూడా లింక్ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పెంచిన కొత్త నిబంధన మార్చి 1నుంచి అమలులోకి రాబోతుంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ ధర రూ.774గా నమోదు కావడంతో సామాన్యుడికి అధిక భారంగా మారింది.
వాహనదారులకు ఫాస్టాగ్ తప్పనిసరి

వాహనదారులకు ఫాస్టాగ్స్ మార్చి 1నుంచి తప్పనిసరి చేసింది కేంద్రం. ఇప్పటినుంచి ముఖ్యంగా ఫాస్టాగ్ కోసం రూ.100 ఖర్చు పెట్టాలి. ఫాస్టాగ్ ద్వారా రీచార్జ్ చేయించుకోకుంటే ఇకపై మీరు ప్రయాణించే మార్గంలో అదనంగా డబుల్ ఫైన్ కట్టాల్సి వస్తుంది.

బ్యాంక్ ఖాతా కోసం కేవైసీ ఉండాల్సిందే.

ఇకనుంచి స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ సేవలను కొనసాగించుకోవాలంటే కేవైసీని తప్పనిసరి చేసింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాల్సిందే. లేకుంటే మీ అకౌంట్ నుంచి ఎలాంటి సేవలు పొందలేరు.
అలాగే ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ వినియోగ దారులకు ఓ విషయాన్ని వెల్లడించింది. పాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్ మీ ఫోన్‌లో ఇక పనిచేయదని కస్టమర్లకు తెలిపింది. దీంతో ఆ బ్యాంక్ వినియోగదారులు ఆ పాత యాప్ వినియోగిస్తుంటే వెంటనే మీ ఫోన్ నుంచి తొలగించుకోవాలని ఆ బ్యాంక్ సూచించింది.

జీఎస్టీ వడ్డింపు

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కి సంబంధించిన కొత్త నిబంధన ఒకటి అమలులోకి రానుంది. మార్చి 1 నుంచి లాటరీకి సంబంధించి కూడా జీఎస్‌టీ తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. లాటరీపై ఇక 28 శాతం జీఎస్‌టీ భారం పడుతుంది. జీఎస్‌టీ కౌన్సిల్ 2019 డిసెంబర్ నెలలోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇప్పుడు మార్చి 1 ఈ రూల్ నుంచి అమలులోకి రాబోతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ లాటరీలపై 28 శాతం జీఎస్‌టీ వడ్డింపు పడనుంది.

రూ. 2000 నోట్లు ఇక కనపడవు

ప్రభుత్వ రంగమైన ఇండియన్ బ్యాంక్ ఓ కొత్త రూల్ పెట్టింది. తన సంస్థ ఉద్యోగులకు, ఇతర అధికారులకు ఇకనుంచి రూ.2,000 నోట్లను ఏటీఎంలలో పెట్టవద్దని పేర్కొంది. కాగా మార్చి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. దీంతో ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో ఇక రూ.2000 నోట్లు కనిపించవు. అంటే రూ.100, రూ.500 నోట్లు మాత్రమే లభ్యం కానున్నాయి. అయితే రూ.2000 నోట్ల ద్వారా చిల్లర సమస్య తలెత్తుతుందనే విషయాన్ని ఆ సంస్థ తెలిపింది. కానీ ఎవరికైనా రూ.2,000 నోట్లు కావాలనుకుంటే నేరుగా సమీపంలోని బ్యాంకుల ద్వారా పొందవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేయడం విశేషం.

టీవీ వినియోగ దారులకు గుడ్ న్యూస్

ముఖ్యంగా డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు ట్రాన్ ఎన్‌టీవో 2.0 రూల్స్‌‌ను మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రకటనతో టీవీ వినియోగదారులు తక్కువ ధరలోనే 200 ఫ్రీ ఎయిర్ టు ఛానెల్స్ అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా మల్టీ టీవీ కనెక్షన్‌కు తక్కువ చార్జీలు చెల్లించవచ్చు. ట్రాయ్ డీటీహెచ్ అండ్ కేబుల్ టీవీ రెగ్యులేషన్స్ మార్పు వల్ల మొత్తంగా డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లపై భారం తగ్గడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *