మాన్సాస్ ట్రస్ట్ పై హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తాం…

ఆంధ్రప్రదేశ్ లోని మాన్సాస్ ట్రస్ట్పై హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ముఖ్యంగా హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. తాను ఇంకా కోర్టు తీర్పు కాపీ పూర్తిగా చూడలేదని.. దానిపై అప్పీల్కు వెళ్తామని స్పష్టం చేశారు. అలాగే మేం ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించ లేదని కూడా అన్నారు. అయితే ఈ తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా, ఒక్కోసారి వ్యతిరేకంగా వస్తాయని వెల్లడించారు.
అదేవిధంగా ఇంకా ఆయన మాట్లాడుతూ లోకేష్ కామెంట్లపై స్పందిస్తూ.. లోకేష్ అటు చిన్నవాడు కాదు.. పెద్దవాడు కాదు.. ట్వీట్ల బాబుగా తయారు అయ్యాడంటూ విమర్శనాస్త్రం సింధించారు. మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్పర్సన్ నియామక జీవోను సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను కొట్టివేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మహాలక్ష్మి దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్కు అశోక్ గజపతి రాజునే చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు జారీచేసింది. కాగా గతంలో మాన్సాస్, మహాలక్ష్మీ దేవస్థానం ట్రస్ట్లకు అశోక్ గజపతిరాజు చైర్మన్గా వ్యవహరించగా.. ఆయనను తప్పిస్తూ ప్రభుత్వం జీవో 72ను జారీ చేసింది. కాగా ఆయన స్థానంలో సంచయితను ట్రస్ట్ చైర్మన్గా ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *