మాతృభాషతోనే భావవ్యక్తీకరణ : మాజీ జేడీ

ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేటు పాఠశాలల సంఘం జాతీయ విద్యావిధానంపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా మాతృభాష ప్రాముఖ్యతపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుడా ఏపీ ప్రభుత్వం కొత్తగా సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని అమలు చేయాలంటే పాఠశాలల్లో కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఇందుకోసం సహకార వ్యవస్థలా మారాల్సిన అవసరం ఉంది. ఈ విధానంలో వసతులు ఎక్కడ ఉన్నా వాటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది అని ఆయన సూచించారు. కాగా జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా పరభాషలో బోధించడం వల్ల విద్యార్థులు అటు మాతృభాష, ఇటు పరభాష రెండింటినీ నేర్చుకోలేకపోతున్నారని లక్ష్మీనారాయణ వివరించారు.