మాతృదేవోభవ రీమేక్ లో నయనతార…

టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా అంటే అది ‘మాతృదేవోభవ’. 1991 లో విడుదలైన ఈ సినిమా 3దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మరోసారి ఈ సినిమాను రీమేక్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రాన్ని.. దర్శకుడు అజయ్ కుమార్ తెరకెక్కించారు.
అదేవిధంగా.. రామారావు మరోసారి అజయ్ కుమార్ తోనే ఈ సినిమాని రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమాకి హీరోయిన్ గా అనుష్క శెట్టి, కీర్తిసురేశ్ పేర్లను పరిశీలించినప్పటికీ.. లేడీ సూపర్ స్టార్ నయనతారను ఖరారు చేసినట్లు విపరీతంగా ఫిల్మ్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. కాగా మాధవి పోషించిన రోల్లో నయనతార బాగా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారని కూడా సమాచారం అందుతుంది. అందుకే నయనతార అయితే బాగుంటుందని మేకర్ భావించారని తెలుస్తోంది.