మాజీ మంత్రి చందూలాల్ కరోనాతో మృతి
తెలంగాణలో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (66) మృతి ప్రజలను షాక్ కు గురచేసింది. టీఆర్ఎస్ పార్టీలో చందూలాల్ మృతి తీరని లోటుగా పార్టీ నేతలు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
అదేవిధంగా కరోనాతో బాధపడుతున్న ఆయన.. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. అయితే చందూలాల్.. ఎన్టీఆర్, కెసిఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణలో మంత్రిగా పని చేశారు. మూడు సార్లు శాసనసభకు, రెండు సార్లు లోక్ సభకు చందూలాల్ ఎన్నికయ్యారు. 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజక వర్గం నుంచి గెలుపొంది సాంస్కృతిక, పర్యాటక మంత్రిగా పని చేశారు చందూలాల్. అయితే ఆయన మృతి పట్ల సిఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.