మహేష్ సరసన బుట్టబొమ్మ…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో వార్త చక్కర్లు కొడుతుంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ బుట్టబొమ్మ క్రేజ్ ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది. ప్రభాస్ తో కలిసి పూజ నటించిన ‘రాధే శ్యామ్’ విడుదలకు రెడీగా ఉంది. అలాగే కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ 65వ సినిమాలో కూడా పూజా అవకాశాన్ని దక్కించుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి డైరెక్టర్ గా ఉన్నారు. సన్ పిక్చర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా.
అయితే తాజాగా ఈ భామ మరో బంపర్ ఆఫర్ ను తన బుట్టులో వేసుకుంది. సూపర్ స్టార్ మహేష్బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్గా పూజాహెగ్డేను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే పూజాతో సినిమా యూనిట్ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం అందుతుంది. స్క్రిప్టు విన్న పూజా.. సానుకూలంగా స్పందించిందని కూడా టాక్. ‘ఎస్ఎస్ఎమ్బీ 28’ వర్కింగ్ టైటిల్గా రూపొందనున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థలు, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్ సహకారంతో నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.