మహేష్ సరసన నయన్… జోడి కుదురుతుందా…?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న విషయం తెసిందే. అయితే గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా గుర్తుండిపోయే సినిమాలుగా చెప్పవచ్చు. ఒకటి బాగా ఆడితే మరొకటి అంతగా స్క్రీన్ పై పండించలేకపోయింది.
అయితే త్రివిక్రమ్- మహేష్ కాంబోలోని సినిమా అతిత్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి హీరోయిన్ పై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో సీనియర్ హోరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. లేడీ సూపర్ స్టార్ నయనతార, సూపర్ స్టార్ మహేష్ పక్కన ఈ కథకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ సరసన నయన్ ఏ మేరకు స్క్రీన్ ఫెయిర్ సెట్ అవుతుందో.. లేదో అనే ఆలోచనలో పడినట్లు సమాచారం అందుతుంది. దీనిపైనా త్వరలోనే స్క్రీన్ టెస్ట్ నిర్వహించనున్నారని టాక్ కూడా నడుస్తోంది. కాగా త్రివిక్రమ్ గతంలో స్టోరీకి తగినట్లుగా సైడ్ క్యారెక్టర్స్, హీరోయిన్స్ లను తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మహేష్ సినిమాలో నయన్ ను దించడంలో అసలు ఉద్దేశ్యం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.