మహేష్, త్రివిక్రమ్ మూవీ పార్థు…?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా వస్తుంది. అయితే ఇప్పటికే వీరిద్దరి కలయికతో ‘అతడు, ఖలేజా’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది. అయితే తొలి రెండు సినిమాలు మహేశ్ కి ఆశించిన స్థాయిలో హిట్ ని అందించలేక పోయాయి. టీవీలలో సూపర్ హిట్ అనిపించుకున్న ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు మహేశ్ తోపాటు త్రివిక్రమ్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇద్దరి సినిమాలు వరుసగా హిట్ అవుతూ వస్తున్నాయి. అందుకే వీరి కాంబినేషన్ పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘ఖలేజా’ తర్వాత పదకొండు సంవత్సరాల గ్యాప్ తో మహేశ్, త్రివిక్రమ్ సినిమా రాబోతుండటం విశేషం.
కాగా మహేష్- త్రివిక్రమ్ సినిమా కోసం ‘పార్థు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి పార్థు అనేది వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’లో మహేష్ క్యారెక్టర్ పేరు. కొన్ని వేలసార్లు టీవీల్లో ప్రదర్శితమై ఆడియన్స్ లో ఆ పేరు బలంగా నాటుకు పోయింది కూడా. అందుకే ఆ పేరు అయితే ఈజీగా జనాల్లో కనెక్ట్ అవుతుంది అనేది వారి ఆలోచన కాబోలు. కాగా ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. మరి వీరి కాంబోలోని సినిమా పేరు ‘పార్థు’ నే నిర్ణయిస్తారా? మరొకటి చూస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *