మహేష్ తో మరో సినిమా చేయాలని ఉంది: కృతి

బాలీవుడ్ భామామణి కృతి సనన్ మహేష్ పై మనసు పడినట్లుగా ఉంది చూడబోతే. అయితే కృతి సనన్.. ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జంటగా ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తుంది. అలాగే గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది బ్యూటీ కృతి సనన్.
అదేవిధంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. అదేమంటే… ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ… మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని ఉందని స్పష్టం చేసింది. తను మొదటిసారిగా కలిసి నటించిన వ్యక్తి మహేష్ అని, ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి అంటూ వివరించింది. అంతేకాకుండా ఆయనతో మరోసారి నటిస్తానని ఆశిస్తున్నాను అంటూ వివరించింది. కాగా ఆదిపురుష్ కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, ఈ సినిమాలో సీత పాత్రలో నటించటం చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుందని అన్నారు కృతి సనన్. మొత్తానికి చూద్దాం కృతి కోరిక ఎప్పుడు తీరుతుందో మరి.