మహేష్ కు జోడీగా ఉప్పెన హీరోయిన్..

టాలీవుడ్ లో ‘ఉప్పెన’ సినిమా మంచి టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే అందులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మోడల్ కృతీశెట్టి… నక్క తోక తొక్కినట్లే అనిపిస్తుంది. అసలు ఇంతకు ముందే సినిమా రిలీజ్ కాకమునుపే.. రెండు మూడు ఆఫర్స్ ను కొట్టేసిన ఈ భామ తాజాగా మహేష్ సరసన కూడా ఛాన్స్ దక్కించుకుంది.
ముఖ్యంగా నేచురల్ స్టార్ నానితో, సుధీర్ బాబుతో ఇప్పటికే సినిమాలు చేస్తున్న కృతీశెట్టిని… రామ్ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలిపాడు దర్శకుడు లింగుస్వామి. ‘ఉప్పెన’ విడుదలైన తర్వాత విపరీతమైన క్రేజ్ రావడంతో కృతీశెట్టి… కొత్త అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. తాజాగా ఈ భామామణి ప్రిన్స్ మహేశ్ బాబు సరసన కూడా ఛాన్స్ దక్కించుకుందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తుంది. కాగా ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న మహేశ్ బాబు ఆ తర్వాత రాజమౌళితో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలకు మధ్యలో అనిల్ రావిపూడితో మహేశ్ ఓ సినిమా చేస్తాడని టాక్. మరి ‘ఎఫ్ 3’ మూవీ పూర్తి కాగానే అనిల్ రావిపూడి మహేశ్ తోనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం మహేశ్ సరసన కృతిశెట్టిని ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. మరి చూడాలి ఇది ఎంతవరకు కృతి పాలిట వరమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *