మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వచ్చే సోమవారం జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొబైల్ ఫోన్ కొన్న మహిళామణులకు 10 శాతం రాయితీ కల్పించనుంది.
అయితే జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మార్చి 8న సోమవారం మొబైల్ ఫోన్ కొని, దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొనే వారికి మాత్రమే రూ.10 శాతం ఆఫర్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా ఏపీలో మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన చేకూరేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అన్నిరకాలుగా మహిళలకు ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వం తగిన చేయూత అందిస్తోంది. కాగా మహిళల కోసం ఇప్పటికే అమ్మిఒడి, చేయూత, ఇళ్లపట్టాలను మహిళల పేరుమమీదనే రిజిష్టర్ చేయడం, డ్వాక్యామహిళలకు చేయూత అందించడం, కుట్టుమిషన్ ఉన్నవారికి చేయూత అందించడం వంటి పథకాలు ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం.. తాజాగా వారి రక్షణ కోసం దిశ చట్టాన్ని పకడ్భందీగా అమలు చేసేందుకు ముబైల్ కొన్న వారికి వినూత్న ఆఫర్ లు ప్రకటించడం సంతోషించాల్సిన విషయం. ఇప్పుడు ఏపీలో మహిళను హోం మినిష్టర్ ని చేయడం, నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆచరణాత్మకంగా అమలు చేయడం వైఎస్ జగన్ విజయంగా చెప్పవచ్చు.