మహారాష్ట్రలో రూపాయికే పెట్రోల్… వాహనదారులు క్యూ….
గత నెలరోజులుగా పెట్రోల్ రేటు విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.100లు దాటింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోవడం ఆందోళన కలిగిస్తుంది. అసలు వాహనాలు బయటకు తీసేందుకు సామాన్యలు తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఇప్పుడు దేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సమయం. ఉద్యోగాలు లేక ఎంతోమంది రోజు రోజుకు జీవనం సాగించలేక పోతున్న సన్నివేశం. సామాన్యుడు బ్రతుకు భారమవుతున్న ఈ తరుణంలో పెట్రోల్ ధరల వరుస పెరుగుదల ప్రజలను మరింత ఒత్తిడికి గురిచేయడమే అవుతుంది. అయితే ఇదే సమయంలో మహారాష్ట్రలోని ఓ పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ ను రూపాయికే అందించారు. అందుకు కారణం ఉందిలేండి… అదేమంటే… మహారాష్ట్ర యువనేత, మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా డోంబివలీ యువసేన ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో రూపాయికే పెట్రోల్ను అందించడంతో కిలోమీటర్ల మేర ట్రాపిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్ కోసం వాహనదారులు క్యూలు కట్టడంతో అక్కడ హడావుడి ఏర్పడింది. అంతేకాకుండా అమర్నాథ్ వింకో నకాలోని ఓ పెట్రోల్ బంకులో రూ.50కి లీటర్ పెట్రోల్ను అందించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వచ్చిన వారికి ఈ అవకాశం కల్పించడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు వాహనదారులు పోటీ పడ్డారు.