మహర్షి, జెర్సీ సినిమాలకు జాతీయ అవార్డులు
2019 సంవత్సరానికి గాను కేంద్రప్రభుత్వం 67వ జాతీయ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ ఎంపికయ్యాయి. ఇక జెర్సీ ఎడిటర్ నవీన్ నూలికి ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో అవార్డు దక్కగా ఉత్తమ నృత్యదర్శకుడుగా ‘మహర్షి’ సినిమా పాటలకు డాన్స్ కంపోజ్ చేసిన రాజు సుందరం ఎంపికయ్యారు.
కాగా ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్ రాజు ఆధ్వర్యంలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఎంపిక కావటం విశేషం.