మళ్లీ దారిలోకి ఎవర్ గివెన్ నౌక

సూయజ్ కాలువను సుమారు వారం నుంచి అడ్డుకుంటున్న కంటైనర్ షిప్ సోమవారం తిరిగి తేలుతూ లైన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దాన్ని అన్ని విధాలుగా రెడీ స్తున్నారని ఇంచ్కేప్ షిప్పింగ్ సర్వీసెస్ పేర్కొందని రాయిటర్స్ స్పెషల్ కథనం రాసింది. దీంతో కీలకమైన జలమార్గం త్వరలో తిరిగి తెరవబడుతుందని స్పష్టం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ నౌక విజయవంతంగా నీటిలో తేలింది. కాగా ఇప్పుడు దాన్ని అన్ని విధాలుగా రెడీ చేస్తున్నారని ప్రపంచ సముద్ర సేవల ప్రొవైడర్ ఇంచ్కేప్ ట్విట్టర్లో వెల్లడించింది. షిప్-ట్రాకింగ్ సర్వీస్ ప్రొవైడర్ వెసెల్ ఫైండర్ దాని వెబ్సైట్లో ఓడ స్థితిని మార్చడం విశేషం.
అదేవిధంగా 400 మీటర్ల పొడువున్న ఎవర్ గివెన్ షిప్.. సూయజ్ కాలువలో వెళ్తూ.. గత మంగళవారం భారీ గాలులకు పక్కకు తిరిగింది. పక్కనే ఉన్న ఇసుకలో అది కూరుకుపోయింది. దాంతో వందలాది నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. సూయజ్ కాలువలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐదు రోజులుగా ఇసుకను తవ్వడం, టగ్ బోట్ల సాయంతో నౌకను లాగడం, నెట్టడం చేశారు. దీంతో ఆ భారీ షిప్ ఎట్టకేలకు తేలింది. ప్రపంచ జలరవాణాలో 15 శాతం ట్రాఫిక్.. ఈ సూయెజ్ కాలువ ద్వారానే నడుస్తోంది. ఇప్పటికే వందలాది షిప్లు ఈ ఎవర్ గివెన్ నౌక అడ్డు ఎప్పుడు వదులుతుందా? అని ఎదురు చూశాయి. కాగా ఈ ఎవర్ గివెన్ షిప్పై మొత్తం 18300 కంటైనర్లు ఉండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *