మలైకా అరోరా చెప్తున్న కరోనా టిప్ ఇదే….
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ సమయంలో సినీ సెలబ్స్ ఎవరికి తోచిన విధంగా వారు ప్రజలను అప్రమత్తం చేసేందుకు తగిన విధంగా స్పందిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ హీరో, హీరోయిన్ లు అంతా తోచిన సలహాలు, సూచనలు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు.
అందులో భాగంగా కరోనా మహమ్మారి భయంతో ప్రజల్లో కూడా ఈ మధ్య కూసింత ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. మునుపెన్నడూ లేనంతగా వ్యాయామానికి సమయం ఇస్తున్నారు. ఇక సెలెబ్రిటీల ఫిట్నెస్ పై అభిమానులకు తెలియంది కాదు. తాజాగా మలైకా అరోరా తన ఫిట్నెస్ చిట్కాలను అభిమానులతో పంచుకుంది. యోగాసన్ అతి ముఖ్యమైన ప్రాణాయామంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు మలైకా అరోరా. అందులో ఆమె ఆరోగ్యకరమైన శ్వాస పద్ధతిని చూపించారు. మందగించిన శ్వాస వ్యవస్థను మెరుగు పరుచుకోవడానికి ప్రాణయామం మంచిదని తెలిపింది. ప్రాణాయామం సులభమైన పద్ధతులను తెలుపుతూ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలో భలే చెప్పేసింది ఈ బాలీవుడ భామ. అదేంటో ఓ లుక్ వేద్దామా..