మరో భారత క్రికెటర్ కు సోనూసూద్ సాయం….
దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ సమయంలో దేశంలో ఎవరు ఎలాంటి సాయం కోరినా వెంటనే స్పందించి వారికి ఆ సాయాన్ని అందిస్తున్నారు సోనూసూద్. సాధారణ ప్రజలనుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోనూసూద్ సాయం అందించడం విశేషం.
అయితే ఈ కరోనా సమయంలో తాజాగా క్రికెటర్ సురేష్ రైనా… నటుడు సోనూసూద్ నుంచి సాయం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో భారత క్రికెటర్ కు సోనూసూద్ సాయం అందించాడు. తొలిసారి కరోనా సమయంలో వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపేందుకు స్పెషల్గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి మరీ సాయం అందించాడు సోనూసూద్. ఈ సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. వంటి ఎన్నో సమస్యలకు సోనూసూద్ సాయం అందిస్తూ వారి అవసరాలను తీర్చే దేవుడుగా మారాడు సోనూసూద్.
అందులో భాగంగా టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయాన్ని అర్థించాడు. అయితే వారి ప్యాన్స్ అందుకోసం సోనూసూద్ను అడగాలంటూ ఫాలోవర్స్ ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సోనూసూద్.. తప్పకుండా సహాయం అందుతుందంటూ భరోసా ఇచ్చాడు. కర్ణాటకలోని అవసరమైన వ్యక్తులకు ఇంజెక్షన్ అందుతుంది అని చెప్పగా.. హర్బజన్ ధన్యవాదాలు సోదరా.. దేవుడు ఆశీస్సులతో మీరు బాగుండాలె అంటూ కోరుకోవడం విశేషం.