మద్యం మత్తులో కారు బీభత్సం.. డ్రైవర్ మృతి
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఘోరం జరిగింది. పిల్లర్ నెంబర్ 100 వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొని వచ్చి డివైడర్ ను ఢీ కొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అదేవిధంగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో పాటుగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్నారని సమాచారం అందుతుంది. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదం వల్లనే చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ చెక్ చేస్తూ, అవగాహనా కలిగిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వరుసగా హైదరాబాద్ లో మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రజలపై ఎక్కించి మృత్యువాత పడేసిన ఘటనలు చాలానే చూశాం. దీంతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి నిరంతరం ఈ ప్రమాదాలను అరికట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.