మంత్రులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు…..
ఆంధ్రప్రదేశ్- తెలంగాణల మధ్య నెలకొన్న జలవివాదం రోజు రోజు వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ అంటే తనకు అమితమైన అభిమానమని… వైఎస్సార్ చనిపోతే తాను ఏడ్చానని.. ఆయన తనకు మంచి ఆప్తుడని తెలిపారు. అలాగే… రాజశేఖర్ రెడ్డి పలకరింపులోనే ఆప్యాయత ఉందని.. అలాంటి వ్యక్తిని రాక్షషుడు అని సంబోధిస్తున్నారని జేసీ మండిపడ్డారు.
అదేవిధంగా వైఎస్ ను బండ బూతులు తిడుతుంటే.. ఏపీ మంత్రులు గాజులు తొడుక్కొని కూర్చున్నారా ఏమిటి? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే వైఎస్ మరణించి 10 ఏళ్ళు అయిందని.. దయచేసి ఆయనను తిట్టకండని విజ్ఞప్తి చేశారు. ఏపీ మంత్రుల నోళ్లు ఏమయ్యాయి…? టీడీపీని తిట్టడానికేనా మీరు ఉన్నది? అంటూ విరుచుకు పడ్డారు. అంతేకాకుండా హైదరాబాద్లో సెటిలర్స్ ఎవరు? అని నిలదీసిన ఆయన.. తమ పిల్లలు హైదరాబాద్లోనే పుట్టారని.. అక్కడే చదువుకున్నారని పేర్కొన్నారు. కాగా ఇక్కడ ప్రజలు హైదరాబాద్కు వెళ్లి షాపింగ్స్ చేస్తున్నారని కూడా వివరించారు.