మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత…

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విద్యార్థుల నుంచి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు ముట్టడించారు. అయితే ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి లేదా ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించాలి అంటూ విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే సత్యసాయి నిగమాగమం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వరకు విద్యార్థులు భారీ ర్యాలీ జరిపారు.
అదేవిధంగా తమ డిమాండ్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సబితా మంత్రి ఇంద్రా రెడ్డిని కలిసి విద్యార్థులు తమ వినతి పత్రం సమర్పించారు. అయితే… ఈ విషయంపై స్పందించిన మంత్రి సబితా… కొద్ది మంది విద్యార్థులతో మాట్లాడి… ఇప్పటికే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడే పరీక్ష కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ… విద్యార్థులు మాత్రం తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *