మంచు హీరోతో జాతి రత్నాలు హీరోయిన్ రొమాన్స్..?

టాలీవుడ్ లో ‘జాతి రత్నాలు’ సినిమాతో మంచి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాధించుకుంది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటనకు యూత్ క్రేజీగా ఫిదా అయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ హైదరాబాదీ బ్యూటీ ఫరియా.
అయితే ఈ భామకు ‘జాతి రత్నాలు’ తర్వాత మరో అవకాశం రాలేదు. కానీ తాజాగా మంచు హీరో సరసన నటించే అవకాశం లభించినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఢీ’ సీక్వెల్ కోసం ఫరియా అబ్దుల్లాను సంప్రదించినట్లు సమాచారం అందుతుంది. మంచు విష్ణుకు ఫరియా అబ్దుల్లా మంచి జోడి కుదురుతుందనే టాక్ వినిపిస్తుంది. ఈ వార్తలే కాని నిజమైతే మంచు విష్ణుతో ఫరియా అబ్దుల్లా రొమాన్స్ చేసే అవకాశం లభించినట్లే. కాగా అతి త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ సినిమా హిట్ అయితే ఇక ఫరియా వెనక్కి తిరిగి చూడక్కరలేదనే చెప్పాలి.