భార్య లక్ష్మీ ప్రణతికి యంగ్ టైగర్ భారీ గిఫ్ట్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనతో అభిమానులు ఎప్పుడూ పెద్ద ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటుంటారు. అంతేస్థాయిలో అంతకు మించిన నటనతో ఎన్టీఆర్ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఏ పాత్రకు ఆ పాత్రలో అలా పరకాయ ప్రవేశం చేసి రక్తి కట్టిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి బర్త్డేకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం తెలిపిన అభిమానులు ఆనందంతో పొందిపోతున్నారు.
విషయం ఏమిటంటే… మార్చి 18వ తేదీన లక్ష్మి ప్రణతి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ సతీమణికి భారీ గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం. పుట్టిన రోజు సందర్భంగా తన అర్ధాంగికి విలువైన కానుకను ఇచ్చారని టాక్ నడుస్తోంది. సిటీలోని ఓ పెద్ద ఫామ్ హౌస్ను ఎన్టీఆర్ తన సతీమణి పేరిట రాయించాడు. అంతేకాకుండా ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అదే ఫామ్హౌస్లో జరిపినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా తన భర్త ఇచ్చిన కానుకకు లక్ష్మీ ప్రణతి ఎంతో సంతోషించినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ 2011 మే 5న ప్రణతిని వివాహమాడారు. వీరికి 2014లో అభయ్ రామ్, 2018లో భార్గవ్ రామ్ జన్మించిన విషయం తెలిసిందే.